బాలయ్య కల సాకారం.. రాజధానిలో కొరటాల శివతో కొత్త చిత్రం ప్రారంభం
- అమరావతి వేదికగా ఘనంగా జరిగిన పూజా కార్యక్రమాలు
- రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం
- రాజధానిలో వేడుక జరపడం బాలయ్య కల అని చెప్పిన నిర్మాత
- ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్, 2027 వేసవిలో సినిమా విడుదల
నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రాబోతున్నట్లు ప్రకటన వచ్చిన నాటి నుంచే ఇండస్ట్రీలో అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు మరింత ఊపునిస్తూ, ఈ క్రేజీ ప్రాజెక్ట్ (వర్కింగ్ టైటిల్ 'NBK 112') ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైంది. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుక జరిగింది.
ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాను సుమారు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.
అమరావతిలో ఈ సినిమాను ప్రారంభించడం వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందని నిర్మాత సుధాకర్ చెరుకూరి వివరించారు. "రాజధాని అమరావతిలో ఒక భారీ సినిమా ప్రారంభోత్సవం చేయాలనేది బాలకృష్ణ గారి చిరకాల స్వప్నం. అది మా సినిమాతో నెరవేరడం చాలా గర్వంగా ఉంది. ప్రకాశం జిల్లా వాడినైన నేను, మన రాజధాని నడిబొడ్డున ఈ సినిమాను లాంచ్ చేయడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి. గత మూడు నాలుగేళ్లుగా బాలయ్య గారితో సినిమా చేయాలన్న నా కోరిక ఇప్పటికి నెరవేరింది" అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్ట్ కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఏపీలో ఉన్న ప్రతిభావంతులకు ఈ సినిమాలో ప్రాధాన్యత ఇస్తామని, ఈ సినిమా స్ఫూర్తితో భవిష్యత్తులో రాష్ట్రంలో మరిన్ని ఫిలిం స్టూడియోలు ఏర్పాటవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక సందేశాన్ని మాస్ ఎలిమెంట్స్‌తో చెప్పడంలో సిద్ధహస్తుడైన కొరటాల శివ, బాలయ్యను ఎలా చూపిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.